ఏంటి డార్లింగ్ ఈ పనులు.. సలర్ హిట్ అయ్యింది అనే లోపే “తుస్సు” మనిపించావుగా..!!

ఏంటో .. ఈ ప్రభాస్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ.. తెలిసి తెలియక తనంతో చేసిన పనులు మాత్రం అభిమానులను బాగా హర్ట్ చేసేస్తున్నాయి . మరీ ముఖ్యంగా సలార్ సినిమా హిట్ అయిందని ఆనందపడాలో .. ఈలోపే ప్రభాస్ చేసిన పనికి బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు రెబల్ అభిమానులు .

సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ అభిమానులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో మనకు తెలిసిందే . అయితే సలార్ హిట్ అయిన తర్వాత ప్రమోషన్స్ చేయనటువంటి సలార్ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా గ్రాండ్గా చేస్తుందని ఆశపడ్డారట జనాలు. అయితే ఎవరికి తెలియకుండా నాలుగో కంటికి కనిపించకుండా సినిమా టీం సభ్యులు మీట్ అయి చిన్న పార్టీ చేసుకొని సెలబ్రేషన్స్ పార్ట్ ని కంప్లీట్ చేసేసారట.

ప్రజెంట్ ఇదే న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్ కు మండిపోయేలా చేస్తుంది. ఏంటి డార్లింగ్ నువ్వు సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో చేసుకుంటావని ఎక్స్ పెక్ట్ చేస్తే ఇలా తుస్సుమనిపించావ్ అంటూ ఫీల్ అయిపోయి కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సలార్ సినిమా విషయంలో ప్రభాస్ ముందు నుంచే సైలెంట్ గా ఉన్నాడు. పేశాంత్ నీల్ కూడా హంగామ చేయలేదు. ఓవర్ చేయలేదు.. కష్టాన్ని నమ్ముకున్నాడు..!!