మరికొన్ని గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారు. గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఏడడుగులు వేసేందుకు ఇటలీ వరకు వెళ్లారు. రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇటలీలోని టుస్కానీ నగరంలో నేడు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ తన ప్రియసఖి లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.
ఇంతవరకు మన టాలీవుడ్ హీరోలెవ్వరూ పరాయి దేశంలో పెళ్లి చేసుకుంది లేదు. మొట్టమొదట వరుణ్ తేజే ఇటలీ దేశానికి వెళ్లి గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాడు. అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కంటా ముందు ఇండియన్ సెలబ్రిటీలు కొందరు ఇటలీలో మ్యారేజ్ చేసుకున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటలీలోనే ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడింది. ఇటలీలోని టుస్కానీ నగరంలోనే వీరి వివాహం కూడా జరిగింది. అలాగే ఇటీవల రానా నాయుడు మూవీలో రానాకు వైఫ్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా అక్షయ్ ఠాకూర్ ను ఇటలీలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. 2015లో వీరి పెళ్లి జరిగితే.. రెండేళ్ల తర్వాత ఆ విషయాన్ని సుర్వీన్ చావ్లా బయటపెట్టింది. ఇక బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జి- ఫిల్మ్ మేకర్ ఆదిత్యా చోప్రా వివాహం ఇటలీలోనే జరిగింది.