భయంకరంగా ఉన్న తంగలాన్ టీజర్..!!

ఎలాంటి పాత్రలోనైనా సరే అభిమానులను తనదైన స్టైల్ లో మేపిస్తు ఉంటారు నటుడు చియాన్ విక్రమ్.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంటారు. ఇక ఆయన నుంచి వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం తంగలాన్ . ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేస్తూ మళ్లీ ఆసక్తి పెంచాలా చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విక్రమ్ గెటప్పులు చాలా ఆకట్టుకుంటున్నాయి.ఫస్ట్ లుక్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ ఈసారి మరొక సక్సెస్ ను అందుకునేలా కనిపిస్తున్నారు.

కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని గనులలో పనిచేసే జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.. ప్రసార చిత్రాలను బంగారుగనుల దగ్గర ఉండే గ్రామాలలోని మనుషులు ఆంగ్లేయుల మధ్య జరిగేటటువంటి యుద్ధ సన్నివేశాలను చాలా భయంకరంగా చూపించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విక్రమ్ చాలా భయంకరంగా చూపించారు కత్తి పట్టుకొని ఎదురు వచ్చిన వాళ్ళని ఒకసారిగా నరికేస్తూ ఉండే సన్నివేశాలతో పాటు పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్లుగా చాలా వైల్డ్ గా చూపించారు.

బంగారం రక్తం కన్నీటి చుట్టు సాగే కథ అన్నట్లుగా తెలుస్తున్నది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ ఇందులో కనిపిస్తున్నట్లు సమాచారం. విక్రమ్ ఈ చిత్రంలోని గెటప్స్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ అన్నిటికీ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కి క్యాప్షన్ గా సన్నాఫ్ గోల్డ్ ఉదయిస్తున్నాడు అంటూ క్యాప్షన్ రాసుకు రావడం జరిగింది. ఒక డైలాగ్ లేని ఈ ప్రసార చిత్రం ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారుతున్నది.