ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీల హవానే కనిపిస్తోంది. హీరోలందరూ శ్రీలీల వెనకే పడుతున్నారు. దాదాపు ఆమె పది సినిమాల్లో భాగం అయింది. అయితే ఇలాంటి తరుణంలో శ్రీలీలకు పోటీ ఇస్తోంది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించిన ఈ భామ.. బేబీ మూవీతో హీరోయిన్ గా మారింది. తొలి ప్రయత్నంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
విమర్శకుల నుంచే కాకుండా సినీ తారల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. బేబీ సక్సెస్ తో వైష్ణవి చైతన్యకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండతో మరోసారి జటకడుతోంది. వీరి కాంబో సినిమాకు సాయిరాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభించారు.
అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా వైష్ణవి ఓ సినిమా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు వారసుడిగా వచ్చిన ఆశీష్ రెడ్డితో `లవ్ మీ` అనే మూవీకి కమిట్ అయింది. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. వీటితో పాటు టాలీవుడ్‌లో మరో రెండు క్రేజీ మూవీస్‌కు వైష్ణవి చైతన్య ఒకే చెప్పినట్లు సమాచారం.