ఖరీదైన కారు కొన్న అషు రెడ్డి.. ధర ఎంతో తెలుసా?

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి అంటేనే బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్ అనే విషయం మనందరికీ తెలిసిందే,. ఆమె ఏం చేసినా బోల్డ్ గానే ఉంటుంది. రామ్‌గోపాల్‌ వర్మ తో కలిసి రచ్చ చేసి మరింత పాపులర్‌ అయ్యిందీ హాట్‌బ్యూటీ. ప్రతి ఫ్రేములోనూ హాట్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ఈ బోల్డ్ బ్యూటీ ప్రయత్నిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఫోటోలు దిగుతుంటుంది. తనదైన స్టయిల్‌లో గ్లామర్‌ను ప్రజెంట్‌ చేస్తూ నెట్టింట మంటలు పెడుతుంది.

యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆషు రెడ్డ.. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ షో మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. ఆతర్వాత రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యతో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి ఆషూరెడ్డి వార్తల్లో నిలిచింది. ఆమె మరో కొత్త లగ్జరీ కారు రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. ఈ ఖారు ఖరీదు సుమారు రూ. 70 లక్షలు ఉంటుంది. అంత ఖరీదైన కారును కొనుగోలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయిన జ్యోతిష్కుడు వేణు స్వామితో కారుకు పూజలు చేయించింది. అషు రెడ్డి ఇంట్లో కొత్త కారు రేంజ్ రోవర్‌ కు వేణు స్వామి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఆషురెడ్డి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఆషురెడ్డితో పాటు వేణుస్వామి కూడా కనిపించాడు. షు రెడ్డి కొత్త కారు వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతుంటారు. కాబట్టి, ఆ కామెంట్లకు చెక్ పెడుతూ కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసి మరి కొత్త కారు పూజకు సంబంధించిన వీడియోను ఆషురెడ్డి పోస్ట్ చేసింది.