కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్న బాలయ్య.. కారణం ఏంటో తెలుసా..?

నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ కి జాతకాలు అన్న తిధులు , న‌క్ష‌త్రాలు ఆచారాలపై చాలా నమ్మకం ఉండేది. ఆయన ఎన్నో నమ్మకాలు పాటిస్తూ ఉండేవాడు. ఇక బాలయ్య కూడా తండ్రిలానే కొన్ని నమ్మకాలను పాటిస్తూ ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాగే ప్రతిదీ తిధి, వార, నక్షత్రాలను చూసుకొని ముందుకు వెళ్తుంటారని అంటూ ఉంటారు.

తాజాగా బాలయ్య ఇప్పుడు ఓ కొత్త ఇల్లుకు మారబోతున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూబ్లి హిల్స్‌లో మెగాస్టార్ ఉంటున్న ఇంటికి చేరువలోనే ఈ కొత్త ఇల్లు ఉంటుందట. ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయని.. ఫిబ్రవరి 2024లో ఈ నూతన గృహప్రవేశం జరగబోతుందని సమాచారం. హఠాత్తుగా ఆయన ఇల్లు మారడానికి వాస్తు బాగోకపోవడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

ఇక ప్రస్తుతం సినిమా పరంగా దూసుకుపోతున్న బాలయ్య.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు రూ.100 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ పాస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇటీవల బాలయ్యతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు లాభాల బాటలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచార‌ని తెలుస్తుంది. అదే విధంగా తను పర్సనల్ జీవితంలో కొన్ని ఒడిదొడ్లకు.. కారణం వాస్తు దోషమేనని తెలిసిన బాలయ్య నూతన గృహప్రవేశానికి నాంది పలికాడట.