బిగ్ బాస్ షో పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బ‌న్ని బ్యూటీ.. ఓ టైం వేస్ట్ షో అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ భానుశ్రీ మెహర. వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2017 అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్‌లో వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమాలో హద్దులు దాటి మరి అల్లు అర్జున్ తో చేసిన లాంగ్ లిప్ లాక్ అప‌ట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సీన్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన ఈ పంజాబి బ్యూటికి తర్వాత సరైన అవకాశాలు రాలేదు. పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో, చిన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు.

ఈమధ్య వచ్చిన విజయ్ సినిమాలోని ఈ బ్యూటీ ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పటివరకు పది సినిమాల్లో నటించినా ఆ సినిమాల పేర్లు కూడా చాలామందికి తెలియవు. ఇక సినిమాల్లో లాభం లేదనుకున్న ఈ బ్యూటీ ఫుల్ టైం ట్రావెలర్ గా మారిపోయి దేశాలన్నీ తిరుగుతూ యూట్యూబ్ వీడియోలను చేస్తు సంపాద‌న మొద‌లుపెట్టింది. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ, స్పాల్లో మసాజ్ లు చేయించుకుంటూ.. గ్లామర్ షో తో భాను నా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా ఈమె బిగ్‌బాస్ షో పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన ఇంస్టాగ్రామ్.. ఎక్స్ ఖాతా వేదికగా ఆమె స్పందిస్తూ బిగ్ బాస్ షో ఒక టైం వేస్ట్ షో.. దీన్ని అసలు జనం ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదు.. పైగా ఆ సీజన్ ఈ సీజన్ అంటూ దాని సీజన్లు సీజన్లుగా రిలీజ్ చేసి ప్రజల మైండ్ తో ఆడుకుంటున్నారు. నా ఇన్‌స్టా అకౌంట్ అంత ఈ బిగ్ బాస్ నోటిఫికేషన్ వీడియోలు తోనే నిండిపోతుంది నాకు ఈ షో అంటే చిరాకు వస్తుంది.. అంటూ ఆమె కామెంట్స్ చేసింది. ప్రస్తుతం భానుశ్రీ మెహరా చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ మారాయి.