చీరలో వర్కౌట్లు చేస్తున్న ప్రగతి ఆంటీ.. ఎలా చేస్తుందో చూడండి

నటి ప్రగతి ఆంటీ ఇటీవల సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో జిమ్ వీడియోలు పెడుతూ ఉంది. బరువులు ఎత్తి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఏదైనా చెయ్యగలరని చాటుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజాంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొని మెడల్ కూడా ప్రగతి సాధించింది. ఇలా నటనతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ పేరు సంపాదిస్తోంది.

అలాగే ప్రగతి ఆంటీ చుట్టూ వివాదాలు కూడా ఉంటాయి. అనేక పుకార్లు కూడా ఆమెపై వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల ఒక నిర్మాతని ఆమె రెండో వివాహం చేసుకున్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఆహె ఖండించారు. అయితే తాజాగా మరోసారి ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రగతికి సంబంధించిన లేటేస్ట్ వీడియో ఆకట్టుకుంటుంది. ఆమె జిమ్ సెంటర్లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఇందులో చీర కట్టుకుని వర్కౌట్లు చేస్తున్న ప్రగతి.. ఏకంగా 90 కిలోల బరువులు ఎత్తింది. చీర కట్టుకొని ఇలాంటి పెద్ద బరువులు ఎత్తడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాధారణంగా వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రత్యేక డ్రెస్ వేసుకుంటారు. కానీ ప్రగతి ఇలా చీరలో వర్కౌట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గతంలోనూ ప్రగతి కఠిన వ్యాయామాలు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. కానీ వయస్సు పెరుగుతున్నా.. ఇంత పెద్ద మొత్తంలో బరువులు ఎత్తడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోన్నారు. మానసికంగా తాను ఎంతో ఫిట్ అని చెప్పడానికే ప్రగతి ఆంటీ ఇలా చేసిందని కొందరు అంటున్నారు. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు రావడంతో.. సీరియస్ అయిన విషయం తెలిసిందే.