బాలయ్య – రవితేజ మ‌ల్టీస్టార‌ర్ రెడ్డి చేసే ప్లాన్‌లో ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌.. ఎవరంటే..?

నందమూరి నట‌సింహం, మాస్ మహారాజ్ కాంబినేషన్లో మూవీ అంటే బాక్సాఫీస్ బద్దలాబాల్సిందే. వీరిద్దరి కాంబో లో అన్‌స్టాపబుల్ నుంచి ఓ ఎపిసోడ్‌ రిలీజ్ అయితేనే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ వచ్చిందంటే ఇక ఫాన్స్ ను ఆపలేం. గతంలో వీరిద్దరి మధ్యన సరైన సంబంధాలు లేవన్న పుకార్లు వచ్చినా ఇటీవల జరిగిన అన్‌స్టాపబుల్‌షోతో ఆ పుకారులకు చెక్ పెట్టారు. వీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశం కూడా ఉందంటూ హింట్ ఇచ్చారు.

ఈ షో తర్వాత రవితేజ – చిరంజీవి కలిసి వాల్తేరు వీరయ్య మూవీ లో నటించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్. తర్వాత బాలయ్య కూడా మూడు వరుస సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా దసరాబరిలో బాలయ్య భగవంత్ కేస‌రి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు పోటీ పడగా బాలయ్య భగవంత్ కేస‌రి ఆధిపత్యం దక్కించుకుంది. టైగర్ నాగేశ్వరరావుకు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అంద‌కపోయిన రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ళ‌ను కొల్లగొట్టింది. అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో స్టార్ మూవీ రాబోతుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రవితేజ – బాలయ్య ఇద్దరు ఎవరు సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరితో మంచి బాండ్ ఉన్న డైరెక్టర్ మలినేని గోపీచంద్ వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్‌ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక గతంలో రవితేజకు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి వరుస హిట్లు ఇచ్చిన గోపీచంద్ ప్రస్తుతం రవితేజతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అలాగే బాలయ్యకు గతంలో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించాడు.

ఆ క్రమంలో విరసింహారెడ్డి తర్వాత బాలయ్య గోపీచంద్ కు మరో ఛాన్స్ ఇస్తానని అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం గోపిచంద్ – రవితేజ కాంబోలో నాలుగో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తాను తీసే సినిమాలు రవితేజకి కూడా ఓ లీడ్‌రోల్ ఇచ్చి ఆ సినిమాను మల్టి స్టార‌ర్‌గా రూపొందించాలని ప్లాన్ లో ఉన్నాడట గోపీచంద్. ఇక గోపీచంద్, రవితేజ ఇద్దరు మంచి స్నేహితులు. అలాగే బాలయ్య మరో సినిమా చేయాల్సి ఉండడంతో ఈ నేపథ్యంలో బాలయ్య – రవితేజ కాంబోలో మల్టీ స్టార‌ర్ సినిమా ప్లాన్ చేశాడట గోపిచంద్.