రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రంభ.. స్టార్ హీరో సినీమాలో..?

ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్స్ సైతం రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలా ఇప్పుడు అలనాటి హీరోయిన్ రంభ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. టాలీవుడ్ లో అప్పట్లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రంభ ఈ సినిమాతో తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారులను అప్పట్లోనే కవ్వించింది.

ఇక తర్వాత రంభ స్టార్ హీరోల సరసన నటించి మరింత క్రేజీ అందుకుంది. తెలుగు తమిళ్ భాషలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఈమెను డైరెక్టర్ వివి సత్యనారాయణ రంభ అనే పేరుగా మార్చడం జరిగింది. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఈమె ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది అదేవిధంగా హీరోయిన్ గా కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టేసింది. వివాహ తర్వాత సినిమాలకు దూరమైన రంభ మలేషియా వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.

రంభ వయసు పెరుగుతున్న తరగని అందంతో అందరిని ఆకట్టుకుంటోంది .ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి రీ యంట్రి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బడా హీరోల సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతుందని సమాచారం. త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందట.. ఇప్పటివరకు సీనియర్ హీరోయిన్లలో ఆమని, ఇంద్రజ, ఖుష్బూ , రోజా తదితర హీరోయిన్లు కూడా రియంట్రీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీరి బాటలోనే రాంబాబు కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.