ఓటీటీలోకి వచ్చేస్తున్న జవాన్.. మరి కొద్ది గంటల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన మూవీ జవాన్. కమర్షియల్ యాక్షన్ థ్రిల‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్ల మేర కలెక్షన్లు సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. ఇందులో షారుక్ యాక్షన్ సీక్వెల్స్, నయన్‌, దీపికల యాక్టింగ్, విజయ్ సేతుపతి విల‌నిజం హైలెట్స్ గా నిలిచాయి.

ఈ సినిమా సక్సెస్ అందుకోవడానికి కీలకపాత్రను పోషించాయి. ఇక థియేటర్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన జ‌వాన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందని షారుక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పటికి వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పడింది. షారుక్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నవంబర్ 2న జవాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా నెట్‌ఫ్లిక్స్ జవాన్ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచి సినిమాని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు ఓటీటీ వారు.

హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో షారుక్ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఇక షారుక్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఈ సర్ప్రైజ్ ఇచ్చిన ఓటీటీ థియేటర్లో ర‌న్‌టైమ్ ప్రాబ్ల‌మ్‌తో కత్తిరించిన మిగతా సన్నివేశాలను కూడా ఇందులో యాడ్ చేసింది. జవాన్ థియేటర్లో 169 నిమిషాలపాటు ర‌న్ అయింది. ఓటీటీలో ఆ సమయం ఇంకాస్త పెరగబోతుంది. రెడ్ చిల్లిస్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ అందించిన పాటలు ఈ సినిమాలో ఛార్జ్ బూస్టర్స్ గా నిలిచాయి. థియేటర్స్ లో జవాన్ మిస్ అయిన ప్రేక్షకులు అంతా మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్రీమింగ్ కానున్న జవాన్ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు అంటూ ఓటీటీ అనౌన్స్ చేసింది.