వామ్మో.. సాయి పల్లవి- శ్రీలీల ఇద్దరు ఒకే సినిమాలోనా..?

ఎక్కువగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం జరుగుతూ ఉంటుంది.. అ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్స్ లో మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటారు అభిమానులు.. అయితే ఇదే ఫార్ములాను కొంచెం మార్చి ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరో కాదు ఒకరు సాయి పల్లవి కాగా మరొకరు శ్రీ లీల.. ప్రస్తుతం ఇలాంటి సాహసాన్ని దిల్ రాజు చేయబోతున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

వీరిద్దరూ కాంబోలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు సైతం చాలా కనుల విందుగా ఉంటుంది అని చెప్పవచ్చు.. అందుకు కారణం రెండు విషయాలు కాగా..అందులో ఒకటి వీరిద్దరూ మంచి డాన్సర్లు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకరిని మించి ఒకరు చేయగలరు.. ఒకే ఫ్రేమ్ లో వీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తే ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు సైతం తెలుపుతున్నారు.. ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్లు ఎవరు ఫ్యాన్ వేస్ వారికి ఉందని చెప్పవచ్చు.

అయితే టాలీవుడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథ కూడా వీరి డాన్స్ చుట్టూనే తిరుగుతుందట.ఇద్దరు కూడా డాన్సర్లు చుట్టూ తిరిగే కథ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో న్యాచురల్ గా కనిపించే పాత్రలను సృష్టించినట్లు తెలుస్తోంది.మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ సాయి పల్లవి శ్రీలీల ఇద్దరూ కూడా ఒకే సినిమాలో కనిపించబోతున్నారని తెలిసి అభిమానులకు ఈ ఊహ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.