వరుణ్ లావణ్య పెళ్లిలో లావణ్య వేసుకున్న హల్దీ డ్రెస్, పెళ్లి చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా.. మదర్ టచ్ వచ్చేలా..

ఈరోజు మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక మరికొద్ది సేపట్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఈ జంట నిన్న ఈ పెళ్లి వేడుకల్లో భాగంగానే మెహందీ, హల్దీ ఫంక్షన్లను గ్రాండ్గా జరుపుకున్నారు. అయితే ఈ హెల్ది వేడుకల్లో లావణ్య వేసుకున్న లెహంగాకు, పెళ్ళికి లావణ్య కట్టుకోబోతున్న చీరకు చాలా స్పెషాలిటీ ఉందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఇక లావణ్య త్రిపాఠిలు పెళ్లి బట్టలు డిజైనర్ అర్చన రావు డిజైన్ చేయగా, వరుణ్ తేజ్ డిజైనర్ మనీషా మల్హోత్రా రూపొందించిన బట్టలను వేసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకున్నారు. ఇటీవల లావణ్య వరుణ్ హల్దీ, మెహందీ ఫంక్షన్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగాయి. వాటికి సంబంధించిన ఫిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఫంక్షన్లో లావణ్య వేసుకున్న లేహంగాకు ఓ స్పెషాలిటీ ఉంది.

ఇంతకీ ఏంటా స్పెషాలిటీ అనుకుంటున్నారా.. హెల్ది కోసం లావణ్య డిజైన్ చేయించుకున్న లేహంగా ఆమె తల్లి చీరతో తయారయిందట. పెళ్ళికి ముందు జరిగే హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని మదర్ టచ్ వచ్చే విధంగా లావణ్య ఇలా ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన రావు ఆమె లేహంగాను డిజైన్ చేశారు. అదేవిధంగా పెళ్లి కోసం లావణ్య త్రిపాఠి కాంచీపురం సారీ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయించారు. ఇందులో సంథింగ్ స్పెషల్ ఉండేలా చీరను డిజైన్ చేశారని తెలుస్తుంది.