చీర కట్టులో సెగలు రేపుతోన్న నేహాశెట్టి.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫొటోలు

డీజే టిల్లు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నేహాశెట్టి ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో అందాలు ఆరబోస్తోంది. ఇవి చూస్తుంటే టాలీవుడ్‌లో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనే యాంబిషన్‌ ముద్దుగుమ్మలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. డీజే టిల్లుతో బ్రేక్ రావడంతో రీసెంట్‌గా గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ గా గుర్తింపు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దీంతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకోగా.. తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

చిన్న, పెద్ద సినిమా అని కాకుండా ప్రతి ప్రాజెక్ట్ ఓకే చేసింది. బెదురులంక సినిమాలో కూడా నటించగా.. రూల్స్ రంజాన్ సినిమాలో కూడా సందడి చేసింది. అయితే చీరకట్టు విధానంతో ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తూనే వస్తోంది ఈ హాట్ బ్యూటీ. బ్యూటీఫుల్ శారీలో అదిరిపోయే ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. నేహాశెట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ శారీలో ఫొటోషూట్ చేసింది.

తాజాగా స్కై బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో నేహాశెట్టి మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మత్తెక్కించే ఫోజులతో రాధిక అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. నేహా ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటిస్తోంది. చీరకట్టులో నేహాశెట్టి సొగసుల ప్రదర్శనకు మన్మమథుడైనా మైమరిచిపోవాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు. అయితే సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే దిశగా నేహాశెట్టి ప్రయత్నం చేస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తోంది.