ఆ కారణంగా డెవిల్ సినిమా వాయిదా..!!

బింబిసార చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో డెవిల్ సినిమా అని విడుదల చేస్తూ ఉన్నారు.. అభిషేక్ పిక్చర్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా నిర్మాత అభిషేక్ డైరెక్టర్ పేరు తానే అని స్వయంగా వేసుకోవడంతో ఈ సినిమా పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి.


ఈ కారణంగానే చిత్ర బృందం డెవిల్ సినిమాని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. బింబిసారా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయడం జరిగింది కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఈనెల 24న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది అనుకుంటే నందమూరి ఫ్యాన్స్ కి చిత్ర బృందం షాక్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవడం వల్ల మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేసినట్లుగా తెలియజేశారు. అయితే త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ని ప్రేక్షకుల ముందుకు ఉంచుతామని చేశారు.

మరి ఈ డెవిల్ రిలీజ్ డేట్ ను మెగా హీరో వైష్ణవి తేజ్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. శ్రీలిల, వైష్ణవ తేజ్ కాంబినేషన్లో వస్తున్న ఆదికేశవ అనే చిత్రం మాస్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో శ్రీ లీల డాన్స్ కూడా అద్భుతంగా వేసిందని ఇటీవలే విడుదలైన సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో సక్సెస్ అందుకున్న వైష్ణవి తేజ్ మళ్లీ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన విజయాన్ని అందుకోలేకపోయారు మరి.