కనీసం 100 రూపాయలైనా ఇవ్వమంటున్న‌ రేణు దేశాయ్.. ఏం జ‌రిగిందంటే.. ?

నటి రేణు దేశాయ్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహారాష్ట్ర పూణేలో స్థిరపడ్డ గుజరాతి ఫ్యామిలీకి చెందిన ఈ ముద్దుగుమ్మ 2000 సంవత్సరంలో తమిళ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. అదే సంవత్సరం పూరి జగన్నాధ్‌ డైరెక్షన్లో బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌ర్వాత‌ జానీ సినిమాతో మరోసారి పవన్ కళ్యాణ్ జంటగా నటించింది. ఈ సమయంలో పవన్ తో ప్రేమలో పడింది. అప్పటికి మొదటి భార్యతో విడిపోయిన పవన్ రేణు దేశాయ్‌తో సహజీవనం ప్రారంభించారు. 2004లో పెళ్లికి ముందే అఖిరా నందన్ కు జన్మనిచ్చిన రేణు దేశాయ్.. 2009లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా ఓ కూతురు జన్మించింది.

 

పెళ్లి తర్వాత పవన్ కళ్యాణ్ రూణు దేశాయ్ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న ఈ జంట ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ రేనుదేశాయ్‌ పిల్లలను పెంచుకుంటుంది. ఇటీవల టైగర్ నాగేశ్వరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ సడన్‌గా కనీసం వంద రూపాయలు అయినా ఇవ్వండి అని వేడుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకీ రేణుకి అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది.. ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. అసలు విషయానికి వస్తే రేణు దేశాయ్ మొదటి నుంచి పెట్ ల‌వరన్న‌ సంగతి అందరికీ తెలుసు.

జంతువులను ఎంతగానో ఇష్టపడుతూ ఉండే ఆమె కొన్ని కుక్కలతో పాటు.. పిల్లులను కూడా పెంచుకుంటుంది. అయితే తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్ చేయించేందుకు యానిమల్ టీం అనే సంస్థ విరాళాలు సేకరిస్తుంది. ఆపరేషన్‌కు రూ.55వేలు ఖర్చు అవుతుందట. ఈ విషయాన్ని తెలుసుకున్న రేణు దేశాయ్ వెంటనే రూ.30 వేలు విరాళంగా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా మిగతా డబ్బు కోసం మీరంతా సహాయం చేయాలి అంటూ సోషల్ మీడియా ద్వారా అడిగింది. నేను రూ.30వేలు పంపించాను దయచేసి ఎవరైనా మిగతా డబ్బులు పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ.100 ఇచ్చిన వాళ్లకు హెల్ప్ అవుతుంది అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టావేదికగా పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.