ద్యావుడా..చెవిలో అల్లు అర్జున్ అలా చెప్పాడా..? ఇంట్రెస్టింగ్ విషయాని లీక్ చేసిన పాయల్..!!

సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం .. భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోతుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలపై కూసింత ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు జనాలు . రీసెంట్గా అల్లు అర్జున్ – పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే సినిమా ప్రొడ్యూసర్స్ స్వాతి ..సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి.. సినిమాలో లీడ్ క్యారెక్టర్ నటించిన పాయల్ ను ఓ రేంజ్ లో పొగిడేసారు బన్నీ.

స్టేజి పైకి వచ్చిన పాయల్ తో ఏదో మాట్లాడుతున్నట్లు ఓ పిక్చర్ తెగ వైరల్ గా మారింది . పాయల్ చెవిలో బన్నీ ఏదో చెబుతున్నట్లు ఒక పిక్చర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రకరకాల చర్చలు కామెంట్స్ వినిపించాయి . ఫైనల్లీ దానికి క్లారిటీ ఇచ్చింది పాయల్. “బన్నీ తన చెవిలో చెప్పింది ఈ సినిమాలో నువ్వు బాగా నటించావని ..నేను నమ్ముతున్నాను అని ..ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టమని ..నువ్వు చాలా డేరింగ్ స్టెప్ వేసావని నన్ను అప్రిషియేట్ చేశారు అని ” చెప్పుకొచ్చింది .

దీంతో ఈ డబల్ మీనింగ్ డైలాగ్స్ కి చెక్ పడింది. అంతేకాదు బన్నీ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంకరేజ్ చేస్తాడు అని.. ఇలా చీప్ కామెంట్స్ బన్నీపై చెయ్యొద్దు అంటూ కొందరికి ఘాటుగా జవాబు ఇస్తున్నారు బన్నీ ఫాన్స్..!!