సంతానం విషయంలో నిహారిక కోసం అంత పెద్ద త్యాగం చేసిన లావణ్య త్రిపాఠి… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు…!!

గత కొన్ని ఏళ్లుగా లావణ్య, వరుణ్ ప్రేమించుకుంటూ.. తాజాగా పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ తో ట్రోలింగ్లో ఉన్నారు. అయితే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కు పరిచయం కాకముందే నిహారిక కు చాలా మంచి స్నేహితురాలు. వీరిద్దరి పరిచయం ఒక జిమ్లో ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోని లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరయిందట.

ఇక ఇదంతా పక్కన పెడితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకి గుడ్ బై చెప్పి.. ఆలస్యం చేయకుండా వెంటనే సంతానం పొందాలని నిర్ణయించుకుందట. కానీ తాజా సమాచారం ప్రకారం లావణ్య తన ఆడబడుచు కోసం ఈ నిర్ణయాన్ని మార్చుకుందట. రీసెంట్గా నిహారిక ప్రొడక్షన్ హౌస్ లో మెయిన్ స్ట్రీమ్ మూవీ లాంచ్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఆ తర్వాత సినిమాలో లావణ్య, వరుణ్ హీరో హీరోయిన్గా నటించాలని కోరిందట నిహారిక. దీంతో లావణ్య సంతానం ఆలోచనని పక్కనపెట్టి.. నిహారిక కోసం మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చూసిన ప్రేక్షకులు..” నిహారిక కోసం ఇంత పెద్ద త్యాగం చేసిందా లావణ్య. నిజంగా గ్రేట్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.