రావడం రావడమే అత్తింటికి గుడ్ న్యూస్ తీసుకొచ్చిన లావణ్య.. మెగా ఇంట మరో సంబరం షురూ..!!

రీసెంట్ గానే మెగా ఇంట పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఇంతలోనే మెగా ఫ్యామిలీ నుండి మరో గుడ్ న్యూస్ వినిపించింది . త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగబోతుందట .

మెగా ఫ్యామిలీ లోకి కొత్తగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నారు . ఈ క్రమంలోనే గృహప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు సత్యనారాయణ వ్రతం కూడా గ్రాండ్ గా చేయబోతున్నారట . ఈ పూజా కార్యక్రమాలకు అల్లు మెగా ఫ్యామిలీ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తుంది .

దీంతో కొత్త కోడలు రాగానే మెగా బ్రదర్ నాగబాబు ఇంట మరో శుభకార్యం జరగబోతుంది అని .. ఇది మెగా ఫ్యామిలీకి ఎంతో శుభసూచకమని త్వరలోనే మరో గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఏకేసిన జనాలు ఫైనల్లీ మళ్ళీ వాళ్లని పొగడటం స్టార్ట్ చేశారట..!