బిగ్ బాస్ సీజన్ 7 రేటింగ్ ఎంతో తెలుసా… ఇది కూడా ఉల్టా పుల్టా లాగే ఉందిగా….!!

బుల్లితెరపై అనేక షోలు, సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. డాన్స్, జోక్స్ ఇలా అనేక రకాల షోలను ప్రేక్షకులు చూసి బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక స్టార్ మా లో బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమం 6 సీజన్లు పూర్తి చేసుకోగా ఏడో సీజన్ ప్రసారమవుతుంది. ఇక ఈ షో గత రెండు సీజన్లుగా పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.

కానీ ప్రస్తుతం మాత్రం ఈ షో ఉల్టా పుల్టా అన్నట్టు ఎంతో రసవత్తంగా సాగుతుంది. ఇక అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు బార్క్ వెబ్ సైట్ తెలుగు టాప్ టెన్ ప్రోగ్రామ్స్ టి ఆర్ పి విడుదల చేసింది. టాప్ లో బిగ్ బాస్ కార్యక్రమం తో పాటు స్టార్ మా ప్రోగ్రామ్స్ ఉండటం ఆశ్చర్యం. బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ కి 6.9 టిఆర్పి అందుకుంది. ఇక వీక్ డేస్ లో 4.91 గా ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 లో వీకెండ్ 3, వీక్ డేస్ లో 2 రేటింగ్ వచ్చేది. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్ చాలా బాగా రేటింగ్ పెరిగిందనే చెప్పాలి.

ఇక ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ కార్యక్రమం మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక బిగ్ బాస్ షో తో పాటు శ్రీముఖి యాంకర్ గా వహిస్తున్న ” స్టార్ మా పరివారం ” కూడా అద్భుతమైన రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఇలా స్టార్ మా లో షోస్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ ప్రోగ్రాం లు ఉన్నాయి. ఇలా ఎన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ కార్యక్రమం మాత్రం టాప్ లో నిలవడం ఆశ్చర్యం.