కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా నమ్రత కీల‌క నిర్ణ‌యం.. స‌హృద‌యం చాటుతున్న మ‌హేష్ ..

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి ఏడాది అయిందని విషయాన్ని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కృష్ణ సాధించిన రికార్డులని ఇప్పటికీ ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేరని ఆయన సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కాదంటూ ఫాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కృష్ణ వారసుడు మహేష్ బాబు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యామిలీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేందుకు ముందు వరుసలోనే ఉంటారు.

కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా నమ్రత – మహేష్ జంటగా మరో మంచి కార్యక్రమం వైపు అడుగులు వేశారు. పేద విద్యార్థులకు చదువు చెప్పించాలని నమ్రత నిర్ణయం తీసుకుంది. న‌మ్ర‌త అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మామయ్య గారి పేరు పై ఒక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నానని.. నమ్రత వివరించింది. ఇప్పటికే నలుగురు టాలెంటెడ్‌ పేద విద్యార్థులను సెలెక్ట్ చేశామని.. ఎంబి ఫౌండేషన్ ఆ చిన్నారులను చదివించడానికి సిద్ధమైందంటూ నమ్రత వివరించింది. వారు ఎంత చదువుకుంటే అంతవరకు అయ్యే ఖర్చును ఎంబి ఫౌండేషన్ భరిస్తుందని ఆమె వివరించింది.

 

ప్రస్తుతం నలుగురికి మాత్రమే సెలెక్ట్ చేసామని ఈ కార్యక్రమానికి మావయ్య ఆశీస్సులు ఉంటాయని నమ్రత వివరించింది. ఇప్పుడు నలుగురు విద్యార్థులు ఉన్నారని ఫ్యూచర్లో ఇంకా ఎంతమంది ఉంటారు తెలియదని.. మాకు చేతనయినంతవరకు పేద విద్యార్థులకు హెల్ప్ చేస్తామని భవిష్యత్తుకు దారి చూపించే వైపుగా అడుగులు వేస్తామని నమ్రత వివరించింది. ప్రస్తుతం నమ్రత చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్టి్ట‌ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహేష్ – నమ్రత సహృదయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను జరిపి పేదలకు సహాయం చేశారు.