టైగర్ నాగేశ్వరరావు నష్టాలపై ఓపెన్ అయిన నిర్మాతలు..!!

ఈ ఏడాది దసరా పండుగ కానుకగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకోవడం జరిగింది. అలా హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా విడుదల కావడం జరిగింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్స్ గా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిండం జరిగింది.మొదటిసారి వీరిద్దరూ తెలుగు తెరకు పరిచయం అవుతూ ఈ చిత్రంలో నటించారు.

టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రవితేజ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా విడుదల కావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల చేశారు.. అయితే చాలా సినిమాలు విడుదల అవ్వడం చేత టైగర్ నాగేశ్వరరావు సినిమాకి పెట్టిన బడ్జెట్ కాని బిజినెస్ మీద కలెక్షన్స్ కూడా అందుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీంతో స్వల్పంగా నష్టాలు వచ్చాయని మాట వినిపిస్తూ ఉన్న తరుణంలో ఈ విషయంపై నిర్మాత అభిషేక అగర్వాల్ స్పందించడం జరిగింది.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ గారు మాట్లాడుతూ తమ చిత్రానికి ఎలాంటి నష్టాలు రాలేదని తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని తామే స్వయంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నామని మాకు రావాల్సినంత వచ్చిందనీ ..నష్టాలు అనేది లేదు అంటూ థియేట్రికల్.. నాన్ థియేట్రికల్గా కూడా తాము సెఫ్ గా ఉన్నామంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది నష్టాలు వచ్చాయని విషయం ఫేక్ అని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ వంశీ తెరకెక్కించారు ఇందులో నాజర్ ,మురళి శర్మ, రేణు దేశాయ్ ముఖ్యమైన పాత్రలు నటించడం జరిగింది. ఈ సినిమా ఓటిటి కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.