చిన్న డైరెక్టర్ మీద.. ప్రభాస్ సినిమాకి అంత బడ్జెటా..!!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మొత్తం భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.. అయితే అన్ని భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా తక్కువ బడ్జెట్ లో కూడా ఏదైనా సినిమా చేయాలని ప్రభాస్ అనుకుంటూ ఉండగా అలాంటి సమయంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం జరిగింది.కథ కూడా సెట్ కావడంతో సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మారుతి కూడా కథ పరంగా పర్ఫెక్ట్ గా ఉండడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ రెమ్యూనరేషన్ మాత్రమే కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మిగతా బడ్జెట్లలో మాత్రం 100 కోట్ల రూపాయల లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. VFX వర్క్ కారణంగా 100 కోట్లకు పైగా ఖర్చు అవుతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. దీన్నిబట్టి చూస్తే 200 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా బడ్జెట్ వెళ్లబోతోందని టాక్ వినిపిస్తోంది

ప్రభాస్ తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేయాలనుకున్న ప్రతిసారి మాత్రం అది వర్కౌట్ కావడం లేదు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. ప్రభాస్ ప్రమోషన్ కంటెంట్ క్లిక్ అయితే వచ్చే లాభాలు భారీగానే ఉంటాయని. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొక సినిమా కల్కి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.