యధా బన్నీ..తధా తారక్.. ఆఖరికి ఆ విషయంలో కూడా ఇంత సింక్ లో ఉన్నారు ఏంట్రా వీళ్లు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా బన్నీ తారక్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పలేం.. రిలేషన్షిప్ అని చెప్పలేం ..ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకసారి బ్రదర్స్ లా.. మరొకసారి బావ బావమరుదుల్లా.. మరొకసారి డీప్ ఫ్రెండ్స్ లా.. మరొకసారి ఇండస్ట్రీకి ఉపయోగపడే హీరోలుగా… ఒకటా రెండ ఎన్ని చెప్పుకున్నా తక్కువే .

ముద్దుగా బావ బావ అంటూ పిలుచుకునే బన్నీ – తారక్ ల లైఫ్లో ఓ ఇయర్ మాత్రం స్పెషల్ స్పెషల్ స్పెషల్ గా నిలిచిపోయింది . అదే 2011 బన్నీ తారక్ ల జీవితాన్ని మలుపు తిప్పింది . ఆ ఒక్క ఇయర్ నే..2011. 6 మార్చి 2011 బన్నీ స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు . అదే సంవత్సరం మే 5 తారక్ ప్రణతి ని వివాహం చేసుకున్నారు .

ఇలా ఎంతో మంచి ఫ్రెండ్స్ గా ఉండే ఇద్దరు హీరోలు ఒకే సంవత్సరంలో కేవలం రెండంటే రెండు నెలల వ్యవధి గ్యాప్ లోనే పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోవడం అప్పట్లో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతేకాదు ఇద్దరూ కూడా ఇద్దరు పిల్లలతో లైఫ్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు . దీంతో ఈ విషయంలో కూడా మీరు ఇంత సింక్లో ముందుకు వెళ్తున్నారా..? నిజంగా గ్రేట్ అంటూ ఫాన్స్ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..!!