స్పీడ్ పెంచేసిన మ‌మాన‌టి.. ప్రస్తుతం కీర్తి ఎన్ని సినిమాల్లో నటిస్తోందో తెలుసా..?

మలయాళ ముద్దుగుమ్మ‌ కీర్తి సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మల‌యాళం, తమిళ్, తెలుగు సినిమాలతో పాటు ఇటీవల బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా దూసుకుపోతుంది. ఇక గతంలో పలు ఫ్లాప్పులతో సతమతమైన కీర్తి సురేష్.. నాని సరసన నటించిన దసరా సినిమాతో సక్సెస్‌ను అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి ద‌క్కించుకుంది. తర్వాత తమిళంలో ఉదయినిది స్టాలిన్ తో జతకట్టిన మామనాన్‌ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో మళ్లీ బిజీ స్కెడ్యూల్‌ గడుపుతుంది మహానటి.

ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో జయం రవి కి జంటగా నటించిన సైర‌న్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇది కాకుండా రఘుదాదా, రెయిన్బో సినిమాల్లో కూడా కీర్తి నటిస్తుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. హిందీలో నిర్మిస్తున్న మరో సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించబోతోంది. తాజాగా మరో హిందీ వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. వెబ్ సిరీస్‌కు అక్క అనే పేరు నిర్ణయించారు.

ఈ సిరీస్‌లో బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా నటిస్తోంది. కాగా వెబ్ సిరీస్‌ల‌కు సెన్సార్ సమస్యలు లేకపోవడంతో విచ్చలవిడిగా సెన్సార్ కంటెంట్‌ను యాడ్ చేస్తూ.. గ్రామర్ సన్నివేశాలపై టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. గతంలో తమన్న, సమంత కూడా వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించి ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు. దీంతో కీర్తి సురేష్, రాధిక ఆప్టే కలిసి నటించబోతున్న ఈ అక్క వెబ్ సిరీస్ లో కూడా గ్లామర్ సన్నివేశాలు అధికంగా ఉంటాఏమో అనే డౌట్ అభిమానుల్లో మొదలైంది.