ప్రభాస్ ” కల్కి ” సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్… ఫొటో వైరల్….!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘ కల్కి 2898ఎడి ‘. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే , దిశా పటాని లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

ఇక తాజా అందుతున్న సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాదులో కల్కి షూటింగ్ జరుగుతుండగా.. మేకర్స్ ప్రభాస్, కమల్ హాసన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరణ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది.

ఇక ఈ షూటింగ్ సెట్స్ నుంచి కమల్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి నారాయణన్ సంగీతం అందిస్తుండగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.