అమర్ ని ఎదవని చేసిన ప్రియాంక.. ఫినలే అస్త్ర గెలుచుకుంది ఎవరంటే…!!

బిగ్ బాస్ 7 చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం ” ఫినాలే అస్త్ర ” టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. మొదటినుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ షో.. టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. అలాగే హౌస్ లో ఉన్న గ్రూపులు పోటాపోటీగా ఆడుతున్నారు.

ప్రియాంక, శోభ, అమర్ SPA గ్రూపుగా.. శివాజీ, యావర్, ప్రశాంత్ SPy గ్రూపుగా హౌస్ లో కొనసాగుతున్నారు.
అయితే ఈ వారం నిర్వహించిన ఫినాలే అస్త్ర టాస్క్ మూలంగా SPA నుంచి P నీ పీకేసినట్లు తెలుస్తుంది. ఈ ఫినాలి టాస్క్ లో గేమ్ పూర్తయ్యే సరికి ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వారి పాయింట్లను మరొకరికి ఇవ్వాలి అని బిగ్ బాస్ ఓ రూల్ పెట్టాడు. ఇక ఈ క్రమంలోనే ప్రియాంక తన పాయింట్స్ ని గౌతమ్ కి ఇచ్చింది.

అనంతరం గౌతమ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఫ్రెండ్ అయినా ప్రియాంక అమర్‌కే తన పాయింట్స్ ఇస్తుందని భావించిన అమర్‌కి షాకిచ్చింది. ఇక‌ సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం… ఫినాలే అస్త్ర ని అమర్ గెలుచుకున్నాడ‌ట‌. దీంతో అమర్ కెప్టెన్ అవ్వక‌పోయినప్పటికీ డైరెక్ట్‌గా ఫైనలిస్ట్ అయ్యాడుగా.. అమర్ కి సుడి బాగా ఉన్నట్టుంది. కెప్టెన్ అవ్వలేకపోయినా.. డైరెక్ట్ గా కప్పుకే ఎసరు పెట్టాడు గా ” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.