తెలంగాణ ఎలక్షన్స్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన మెగా హీరో.. ఏం చేశాడంటే..?!

తెలంగాణ లో ఎలక్షన్ హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం కావడంతో సామాన్యుడు దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టి వచ్చాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం మైసూర్లో జరుగుతుంది. ఇక తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు షూటింగ్‌ను బ్రేక్ చేసి మరి హైదరాబాద్ కి చేరుకున్నాడు చరణ్. తన ఫేవరెట్ జెట్ విమానంలో భాగ్యనగరానికి వచ్చేందుకు చరణ్ లక్షలు ఖర్చు చేశాడట.

ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసుకున్న చరణ్ తాను, తనతో వర్క్ చేసే మరికొందరిని ఆ ఫ్లైట్ లో హైదరాబాద్ కి తీసుకొచ్చాడట. కేవలం ఒక్క ఓటుకి అయినా ఇంత మేరా ఖర్చు పెట్టి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ వార్త చూసిన ప్రేక్షకులు ఈ మెగా హీరోని ప్రశంసిస్తున్నారు. ఓటు హక్కు పట్ల మెగా హీరోకు ఉన్న బాధ్యతను పొగుడుతున్నారు.