జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బన్నీ ఫ్యాన్..అబ్బబ్బా..ఏం అదృష్టం చేసుకున్నిందో ఈ పిల్ల(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అల్లు అర్జున్ పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు ఓ రేంజ్ లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు ఉన్నా కూడా అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు . దానికి నిదర్శనంగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరిలాగే బన్నీ కూడా ఇవాళ హైదరాబాదులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అయితే అక్కడ ఉండే జనాలను చాలా నవ్వుతూ ప్రేమగా పలకరించిన బన్నీ వస్తూ వస్తూ దారిలో ఆయన లేడీ ఫ్యాన్ ను పలకరించారు . ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేలా ఓ వీడియో చేశాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..” నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి ..? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ..? 13000 మంది ఉన్నారు అంటూ ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది.”

దీంతో నీకు ఇంకా ఎంతమంది ఫాలోవర్లు కావాలి..? అంటూ ప్రశ్నిస్తారు . 30 కే అంటూ సమాధానం ఇస్తుంది ఆ అమ్మాయి. అయితే ఈ వీడియోతో నీకు 30 కే ఫాలోవర్స్ వస్తారు అనుకుంటున్నావా..? అంటే ఎస్ సార్ అంటూ ఆన్సర్ ఇస్తుంది . దీంతో ఈ సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ సెల్ఫీ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారడమే కాకుండా ఆ అమ్మాయికి ఫాలోవర్స్ ని కూడా పెంచేస్తుంది..!!