“నేను అలా చేయడానికే పనికి వస్తానా..?” ఇంటర్వ్యూలో సీరియస్ అయిన శ్రీలీల..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.  టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో శ్రీ లీల పేరే ఎక్కువగా వైరల్ అవుతూ వచ్చింది . కాగా రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి సినిమా సైతం బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫాన్స్ అందరు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు.

త్వరలోనే ఆమె నటించిన ఆదికేశవ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో సంతోష్ శోభన్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది ఈ అందాల ముద్దుగుమ్మ . సరదాగా సాగిపోతున్న ఇంటర్వ్యూలలో సంతోష్ శోభన్ సడన్గా శ్రీలీలకు  ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

” మా దగ్గర ఒక కథ ఉందని ..మీకు ఆప్ట్ గా సూట్ అవుతుంది అని .. ఈ సినిమాలో మూడు అద్దిరిపోయే సాంగ్స్ ఉంటాయని ..మాస్ స్టెప్స్ కూడా ఉంటాయని.. మీరు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు”.  దీంతో వెంటనే సీరియస్ అయిపోయిన శ్రీలీల “నేను డాన్స్ చేయడానికి మాత్రమే పనికొస్తానా..? ఏంటి..? అంటూ కూసింత ఘాటుగానే జవాబు ఇచ్చింది . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!