కమర్షియల్ మాస్ గా అదరగొట్టేస్తున్న ఆదికేశవ ట్రైలర్..!!

ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత ఒకే తరహాలోని కథలు చేయకుండా కాస్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత తను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇటీవల శ్రీలీల లక్కీ హీరోయిన్గా మారడంతో ఈమెను తను నటిస్తున్న ఆదికేశవ లో హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా నవంబర్ 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో ఈ సినిమా పైన హైట్ పెంచడానికి ఆదికేశవ ట్రైలర్ సినిమాను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అల్లరి ముఖాగా తిరిగే యువకుడు ఆ తర్వాత హీరోయిన్ ని చూసి ప్రేమలో పడి విలన్ గా వచ్చే వారిని ఎదుర్కొనడం జరిగినట్టుగా చూపించారు.

 

రెగ్యులర్గా మాస్ హీరో చేసే కమర్షియల్ సినిమా తరహాలోని ఈ ఆదికేశవ సినిమా ట్రైలర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే అసలైన కథ మూలనికి ఏదైనా కొత్త పాయింట్ కనిపిస్తుందేమో చూడాలి మరి.. శ్రీలీల తో వైష్ణవ తేజ్ కెమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ.. డైలాగులు చాలా ఓవర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ డోస్ ఈసారి ఎక్కువగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ ఆ తరువాత రొమాంటిక్ లవ్ ఆ తర్వాత హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.