రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని శర్మ మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి.

బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీస్తున్నారు పూరి జగన్నాధ్. “డబుల్ ఇస్మార్ట్” పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే హీరో రామ్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఖరారయ్యారు. సంజయ్ దత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ సెరవేగంగా సాగుతోంది. ఐతే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయినప్పటికీ, ఇంతవరకు ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో బయటపెట్టలేదు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ కు జోడిగా సాక్షి వైద్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. సాక్షి ఇప్పటివరకు రెండు చిత్రాలలో మాత్రమే నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. సాక్షి నటించిన మొదటి చిత్రం ఏజెంట్. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్.

నాసర్, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయ్యి, బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సాక్షి నటించిన రెండో చిత్రం గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్ హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బి.వీ.ఎస్.యెన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి ఈమె నటిస్తున్న మూడో చిత్రమైన మంచి ఫలితాన్ని రాబడుతుందో లేదో, వేచి చూడాల్సిందే.