సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరియానా…బీచ్ లో ఫొటోలతో రచ్చ!

ఎవరి జీవితం ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఈ మలుపులు కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొందరికి చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఐతే అరియనా గ్లోరీ విషయంలో మాత్రం మొదటిదే జరిగింది. అప్పటివరకు ఎవ్వరికీ తెలియని అరియనా, ఒకేఒక్క ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ యు ట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు ఆర్ జీ వీ యు ట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన ఒక వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏకంగా బిగ్ బాస్ వరకు తీసుకువెళ్ళింది. ఐతే ఆర్ జీ వీ పుణ్యమా అని వచ్చిన పబ్లిక్ అటెంషన్ ను చాలా తెలివిగా వాడుకుంది అరియనా. మళ్ళి జనాలు తనని మర్చిపోకుండా ఉండేలా, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ పిక్స్ తో రచ్చ చేస్తూ వస్తోంది. విభిన్నమైన లుక్స్ తో ఫోటోలు పెడుతూ, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది ఈ అమ్మాయి.

తాజాగా అరియనా, తానూ బీచ్ లో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జిం వేర్ లో అరియనా బీచ్ వడ్డున నిలబడి తీసుకున్నో ఈ ఫోటోలలో ఆమె తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. మొదట్లో అరియనా ఈటీవీ అభిరుచి, మన స్టార్స్, జెమినీ కామెడీ షోలకు యాంకర్ గా చేసింది. ఐతే ఆర్ జీ వీ ఇంటర్వ్యూ తరువాత ఆమెకు బిగ్ బాస్ సీసన్ 4 లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షో లో ఆమె థర్డ్ రన్నర్ అప్ గా నిలిచింది. బిగ్ బాస్ లో ఆమె ఆట చూసినవారంతా ఆమెకు అభిమానులైపోయారు. ఆ తరువాత అనేక షోలకు యాంకర్ గా వ్యవహరించిన అరియనా, ఆ తరువాత అనుభవించు రాజా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ చిత్రాలలో కూడా నటించింది.

అరియనా ఎప్పుడు సోషల్ మీడియా లో ఫోటో పెడుతుందా అని ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. బిగ్ బాస్ సమయంలో స్లిమ్ గా ఉన్న అరియనా, ఇప్పుడు మాత్రం కాస్త బొద్దుగా తయారయింది. ఇది చూసిన అభిమానులు ఆమె అందానికి ఆకర్షితులవుతున్నారు. ఆమె ఫోటోలకు కామెంట్లు కూడా పెడుతున్నారు. హాట్ లుక్స్ తో మతి పోగొడుతున్నావ్ అని కొందరు అంటుంటే, మరి కొందరు ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నిస్తున్నారు.