చిరంజీవి-అల్లు అరవింద్ మధ్య బయటపడ్డ విభేదాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి బడా ఫ్యామిలీగా మెగా కుటుంబం పేరు సంపాదించింది.. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా పలు రకాల రికార్డులను కూడా తిరగరాసాయి. అయితే చిరంజీవి వెనుక అల్లు అరవింద్ హస్తము ఉందని గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ విభేదాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అల్లు అరవింద్ చేస్తున్న చేష్టలు చేస్తూ ఉంటే కచ్చితంగా ఇది నిజమనేలా కనిపిస్తోందట.

చిరంజీవితో ఎవరైతే అగైనెస్ట్ గా ఉంటారో వారందరితో అల్లు అర్జున్ పరిచయాన్ని ఏర్పరచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు సైతం అల్లు అరవింద్ మీద కాస్త గుర్రు గానే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం బాలయ్యతో ఆహాలో అన్ స్టాపబుల్ షోని చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చిరంజీవి బాలయ్య మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా.. సినిమాల పరంగా ఉండడంతో అల్లు అర్జున్ ఇలా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మరొక హీరో మోహన్ బాబుతో కూడా అల్లు అరవింద్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే చిరంజీవి అంటే గిట్టని వారితో మంచి ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకుంటున్నట్లుగా టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అల్లు అరవింద్ చాలామంది దగ్గర చిరంజీవి గురించి కాస్త బ్యాడ్ గానే ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటివన్నీ చిరంజీవి పట్టించుకోలేదని సమాచారం. కానీ ఇలాంటి పనులన్నీ కూడా అల్లు అరవింద్ ఎందుకు చేస్తున్నారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. మరి అల్లు అరవింద్ ఈ విషయం పైన స్పందిస్తారేమో చూడాలి మరి.