గూడచారి-2 చిత్రంలో శోభితా చెల్లెలా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విజయాలతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సొంతం అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లలో నటించి ఆ తర్వాత కర్మ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఇవేవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయినా.. పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించి తన నటనతో బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత క్షణం గూడాచారి వంటి తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.

ఆ తర్వాత ఎన్నో స్పై సినిమా క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన అడవి శేషు ఇటీవలే గూఢచారి-2 చిత్రంలో హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలు పెట్టి ఎప్పుడో అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. తాజాగా గూడాచారి-2 చిత్రంలో హీరోయిన్ సైతం పరిచయం చేశారు ఆమె ఎవరో కాదు బనిత సందు.

అయితే ఈ ముద్దుగుమ్మ తమిళంలో అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్గా నటించింది. పంజాబ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న బణిత బాలీవుడ్ లో కూడా నటించింది. ఇలా ఏన్నో భాషలో నటిస్తున్న ఈమె తెలుగులో గూఢచారి-2 చిత్రంలో నటిస్తున్నది. అయితే ఈ ముద్దుగుమ్మ పోస్టర్ చూసిన తర్వాత G-2 బృందం అద్భుతమైన బనితా సందుని బోర్డులోకి స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గ్లోబల్ సినిమా కోసం గ్లోబల్ నటి అంటూ అడవి శేషు చెప్పుకురాగా ఏమైనా చూస్తే కచ్చితంగా గూడాచారి సినిమాలో నటించిన శోభితా లాగా కనిపిస్తోంది. ఇద్దరు కూడా అక్క చెల్లెలు లాగా కనిపిస్తున్నారని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. శోభిత చెల్లెలు లాగే ఉందని తీసుకున్నావా అడవి శేషు బ్రో అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.