కమలహాసన్ చిన్న కూతురు ఆ నటుడితో ప్రేమాయణం.. కట్ చేస్తే..!!

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణంగా మారిపోతూ ఉన్నాయి. ఎవరిని ఎవరు ప్రేమిస్తారు ఎవరిని వివాహం చేసుకుంటారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.. ముఖ్యంగా ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఎందుకు విడాకులు ఇస్తారో కూడా తెలియదు పెళ్లికి ముందు చాలామంది ప్రేమాయణాలు గురించి ఇండస్ట్రీలో కామన్ గా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్లు ప్రేమించుకొని చెటపట్టాలేసుకొని తిరగడం ఆ తర్వాత నచ్చక విడిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా కమలహాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా ఒక నటుడితో ప్రేమాయణం నడిపి పెళ్లికి రెడీ కూడా అయ్యిందట.

ఆ నటుడు ఎవరో కాదు తనూజ్ విర్వని.. అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి కుమారుడే ఈ నటుడు 2013లో కోలీవుడ్కు బాలీవుడ్కు పరిచయం చేసింది ఈమె. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడం జరిగింది. ఓటీటి పుణ్యమా అంటూ ఒక వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే పలు రకాల వెబ్ సిరీస్లలో నటించారు. కెరియర్ మొదట్లోనే తనూజ్ అక్షర హాసన్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఈ ప్రేమ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతుందని రూమర్స్ కూడా వినిపించాలి అంతలోనే కొన్ని విభేదాలు వలన వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తనూజ్ మరో నటితో ఎఫైర్ నడిపినట్లుగా సమాచారం. ప్రస్తుతం వీరిద్దరిని కాదని తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని అధికారికంగా ప్రకటించారు. నిశ్చితార్ దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.