బిగ్‌బాస్ సీజన్ 7 లో రతిక రోజ్, దామిని కంటెస్టెంట్లుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక దామిని మూడో వారం ఎలిమినేట్ కాగా.. రతిక నాలుగోవ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ తో హౌస్ లో అడుగు పెట్టింది. అయితే సింగర్ దామినికి.. రాహుల్ సిప్లిగంజ్ మంచి ఫ్రెండ్ కావడంతో రతిక – రాహుల్ లవ్ మ్యాటర్ పై కొన్ని కీలక విషయాలను వివరించింది దామిని. బిగ్‌బాస్ 7లో అత్యంత నెగెటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్లలో రతిక ఒకటి. పిఆర్‌టింని ముందుగానే సిద్ధం చేసుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక.. ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ చేసుకుంది.
హౌస్ లో ఎఫైర్లు పెట్టుకోవాలి అనేది కూడా ఆమె స్ట్రాటజీనే.. అందుకే మొదట పల్లవి ప్రశాంత్ ను రెచ్చగొట్టింది. పల్లవి ప్రశాంత్ కు దూరం అయ్యాక యావర్‌కి లైన్ వేసింది. రతిక గేమ్‌లో భాగంగా ఆడిన మరో నాటకం సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఎఫైర్. ఈ మ్యాటర్ తనకు ఫేవర్ గా మార్చుకోవాలని చాలా విధాలుగా ట్రై చేసింది. సింపతి రాబట్టాలని ప్లాన్ చేసుకుంది. తనకు ఓ బ్రేకప్ స్టోరీ ఉంది.. అతడు ఇప్పటికి గుర్తుకొస్తున్నాడు అంటూ పదేపదే ఆమె హౌస్ లో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. బిగ్‌బాస్ కి పేరు చెప్పకున్నా హౌస్‌మేట్స్‌తో తన మాజీ లవర్ రాహుల్ అంటూ అతని గురించి మాట్లాడేదట. ఇక అదే విధంగా హౌస్ లో బ్రేకప్ మేటర్ లీక్ చేయగానే ఆమె పిఆర్‌టీమ్ వీళ్ళిద్దరి ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.
దీనిపై రాహుల్ మండిపడ్డాడు. వాళ్ల గేమ్‌ని నమ్ముకోకుండా ఇతరుల ఫేమ్ వాడుకొని గెలవాలని ప్రయత్నిస్తున్నారని.. పరోక్షంగా రతికపై పోస్ట్ పెట్టాడు. దీంతో రతికకు బాగా మైనస్ అయింది. నాలుగో వారం ఎలిమినేటై హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక రతిక కంటే ముందుగా దామిని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దామిని మూడవ ఎలిమినేట్ కాగా ఆమె బయటకు వెళ్ళగానే రాహుల్ సిస్లిగంజ్ ఫోన్ చేశాడట. తనను కలిసి అసలు విషయాన్ని వివరించాడట. రాహుల్ వ్యక్తిగత విషయాలను అసలు ఎవరితోనూ పంచుకోడు.. కాకపోతే రతిక హౌస్లో చేసిన పనికి నాతో అన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు అని దామే చెప్పుకొచ్చింది.
వారు గతంలో డేటింగ్ చేసిన సంగతి నిజమే.. వ్యక్తిగత కారణాలతో వారు విడిపోయారని దామిని వివరించింది. బిగ్‌బాస్‌హౌస్ లో రతిక తనకు రాహుల్ తో జరిగిన లవ్ మేటర్ గురించి తరచుగా చెప్తూ ఉండేదని.. అయితే అది స్ట్రాటజీ అని నేను అనుకోలేదు అంటూ వివరించింది. అసలు నేను ఎలిమినేట్ కావాల్సింది కాదు.. బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. రతికను మళ్ళీ హౌస్‌లోకి పంపడానికి నన్ను, శుభశ్రీ ని పావులుగా వాడుకున్నాడు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. శుభశ్రీకి తనకంటే తక్కువ ఓట్లు పడినా.. రతికనే బిగ్ బాస్ రీఎంట్రీకి ఎంపిక చేసాడు అంటూ వివరించింది. ప్రస్తుతం దామిని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.