ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించ‌డానికి రాజమౌళి భార్య రమా రాజమౌళియే కారణమట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న రాజమౌళి భార్య చేసిన పని వల్ల ప్రభాస్ ఈ సినిమాలో నటించాడు అంటూ తెలుస్తోంది.

Watch Mirchi - Disney+ Hotstar

సునీల్ మర్యాద రామన్న తర్వాత రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో బాహుబలి సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. ఇక‌ రాజమౌళి ఈగ సినిమాను త్వరగా పూర్తి చేయాలని మొదలుపెట్టడం ఈ సినిమాకు రెండేళ్లు సమయం పట్టడంతో ప్రభాస్ ప్లాన్ కూడా మారిపోయింది. రాజమౌళి అనుమతితో ప్రభాస్ లారెన్స్ డైరెక్షన్లో రెబల్ సినిమాలో నటించాడు. రెబల్ సినిమా పూర్తి అయిన తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి కథను నటించేందుకు ప్రభాస్ ఎంతగానో ఆసక్తి చూప్పాడు. బాహుబ‌లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభాస్కు మిర్చి మూవీని ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయంలో రామారాజమౌళి ఇన్వాల్వ్ అయి.. రాజమౌళి సినిమా అంటే ఎలాగూ సమయం పడుతుంది.

Rama Rajamouli Bio 2023, Age, Husband, Family & More

మీరు ముందు మిర్చి సినిమాను పూర్తి చేస్తే తర్వాత బాహుబలి షూటింగ్లో పాల్గొనండి అంటూ సలహా ఇచ్చిందట. అలా రమారాజమౌళి సపోర్ట్ లభించడంతో ప్రభాస్ మిర్చి సినిమా షూటింగ్లో పాల్గొని ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతి కాంబినేషన్ లో మరో సినిమాలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానుంది. ఇక త్వ‌ర‌లోనే స‌లార్ పార్ట్ 1 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.