కోలీవుడ్ హీరో విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో.. గత సినిమా తరహాలోనే ఈ సినిమాలను తెరకెక్కించడం జరిగింది. గత చిత్రాలలో బలమైన హీరో బ్యాక్ స్టోరీ లేకపోవడం కూడా కాస్త మైనస్ గా వినిపించాయి. అయితే లియో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రియల్ కాదని అసలు ఒరిజినల్ కథ వేరే ఉందంటూ పార్ట్ 2 లో చూపిస్తాను అంటూ లోకేష్ ఈ సినిమాని ఇన్ డైరెక్టర్గా ఇంటి ఇవ్వడం జరిగింది. లియో సినిమా దసరా కానుకగా విడుదలై డివైడకు సొంతం చేసుకుంది.
దాదాపుగా 600 కోట్ల వరకు ఈ సినిమా కలెక్షన్ సాధించిందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఎంతవరకు అది వాస్తవం అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.. కానీ అన్ని ప్రాంతాలలో భాషలలో బ్రేక్ ఈవెన్ అయితే వచ్చిందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. బయ్యర్లు కూడా ఈ సినిమా కారణంగా నష్టపోలేదని తెలుస్తోంది. అయితే నిర్మాతకి మాత్రం లియో మూవీతో ఏకంగా 100 కోట్ల లాభం వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
లియో సినిమాకి సుమారుగా 350 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెట్టారని అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా పైన ఏకంగా 450 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని.. నాన్ థియెట్రికల్ రైట్స్ ద్వారా 210 కోట్లు ఆదాయం ఇక థియేటర్ రైట్స్ ద్వారా 250 ఆదాయం వచ్చిందట. దీంతో బ్రేక్ ఈవెన్ సాధించడంతో థియేటర్ రైట్స్ ద్వారా వచ్చే డబ్బులను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదట. అలా 350 కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్లు లాభం లియో సినిమా ద్వారా నిర్మాతలకి వచ్చాయని కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.