ఇప్పుడు డ‌బ్బుకోసం సినిమాలో నటించాలంటే భయమేస్తుంది.. అలియా భట్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ జంటగా నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో గంగుబాయి కథియావాడి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇటీవల ఫిలింఫేర్ ఓటిటి అవార్డు వేడుకల్లో మెరిసి సంద‌డిచేసింది. ఈ వేడుకల్లో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న ఈమె స్టేజ్ పైన ఉండ‌గానే ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.

`

కొంతసేపటికి అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ.. నేను బాగా నటిస్తానంటూ ఒకప్పుడు అందరు మెచ్చుకున్నారు. ఇప్పుడేమో గొప్ప నటిని, మహానటిని అంటూ అవార్డులు ఇస్తున్నారు. ఇలాంటి అభినందనలు, బిరుదులు, సత్కారాలు, పురస్కారాలు నా రెస్పాన్సిబిలిటీని మరింతగా పెంచుతున్నాయి. నేను ఓ కమర్షియల్ హీరోయిన్. ప్రతిసారి నాకు గొప్ప పాత్రలు రావు. ప్ర‌స్తుతం నాకు డబ్బు కోసం సినిమాల‌లో నటించాలంటే భయమేస్తుంది అంటూ అలియా భ‌ట్ చెప్పుకొచ్చింది.

Alia Bhatt Upcoming Movies 2023 & 2024 with Release Date, Budget -  JanBharat Times

ఇక అతి చిన్న వయసులోనే జాతీయ అవార్డు అందుకోవడం పట్ల అలియా స్పందిస్తూ.. అవార్డ్‌ అందుకున్న వారందరిలో నేనే చిన్నదానని అని ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలిసాక రణ్‌బీర్ నాకు చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అందించాడు. ఏమి ఇచ్చాడు అడగొద్దు. అది చాలా సీక్రెట్ అంటూ ఆలియా నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఆలియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇంతకీ రణ్‌బీర్ ఇచ్చిన ఆ విలువైన బహుమతి ఏమై ఉంటుంది అనే సందేహాలు ప్రేక్షకులలో మొదలయ్యాయి.