వెంకటేష్ సినిమాలో నటించనని మొఖం మీదే చెప్పేసిన ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కారణం ఇదే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీస్‌లో కానీ విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ హీరోకు లేదనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్‌కి క్యూ కట్టేస్తారు. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయినైనా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వెంకటేష్ తో సినిమా అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని భావిస్తూ ఉంటారు. చాలామంది స్టార్ హీరోయిన్ ఇప్పటికే వెంకటేష్ తో జతకట్టి పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్స్ గా పాపులారిటీ దక్కించుకున్నారు.

Venky Mama 10 days collection report

వారిలో ట‌బ్బు, దివ్యభారతి, కత్రినా కైఫ్ ఇలా ఎంతోమంది నట్లు ఉన్నారు. వీళ్లంతా ఒకప్పుడు వెంకటేష్ తో సినిమా చేసి పాపులరై బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అయితే మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ మాత్రం వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ ముఖం మీద నో చెప్పేసిందట. ఇంతకీ వెంకటేష్ తో కాజల్ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో..? ఒకసారి చూద్దాం. గ‌తంలో వెంకటేష్, నాగచైతన్య కాంబోలో ” వెంకి మామ ” సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్యకు జంటగా రాశి కన్నా, వెంకటేష్ జంటగా పాయల్ రాజ్ పుత్ నటించారు.

Kajal Agarwal and Naga Chaitanya in a still from the Telugu movie Dhada

అయితే ఈ సినిమాలో మొదట పాయల్ ప్లేస్ లో కాజల్‌ను తీసుకోవాలని భావించారట మూవీ మేక‌ర్స్‌. కానీ కాజల్ మాత్రం ఈ సినిమాకు కరాకండిగా నో అని చెప్పేసిందట. అది వెంకటేష్ తో నటించడం ఇష్టం లేక కాదట. నాగచైతన్యకి అత్తగా నటించడం ఇష్టం లేక. గతంలో నాగచైతన్యతో కలిసి కాజల్ దడ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ లో మంచి మార్కులు పడ్డాయి. దీంతో మళ్ళీ నాగచైతన్యతో హీరోయిన్ గానే నటిస్తాను కానీ. అత్త లాంటి పాత్రలో నటించే ప్రసక్తే లేదని చెప్పేసిందట కాజల్. ఇక వెంకీ మామ రిలీజ్ అయిన కొత్తలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.