అమ్మ బాబోయ్…” యానిమల్ ” టికెట్ ధర..2,400 రూపాయలా.. సాధార‌ణ ప్ర‌జ‌లు చూడొద్దా..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా విడుదల కానుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా అన్ని ప్రధాన నగరాలలో యానిమల్ బుకింగ్స్ ఇప్పటికే మొదలు కాగా.. కొన్ని చోట్ల టికెట్ రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయట.

ఢిల్లీలో ఈ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.2,400 ఉండటం ఆశ్చర్యం. ఇక ముంబైలో అయితే రూ. 2000 వరకు ఉందట. ఇక ఆయా రాష్ట్ర ప్రజల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని మేకర్స్ టికెట్ రేట్లను పెంచారని తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రంలో అయితే ఈ మూవీ టికెట్ ధర పరిమితంగానే ఉంది.