బాలీవుడ్ లో అవకాశాలు వచ్చిన నో చెప్పిన మెగాస్టార్.. కారణం..?

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే అన్ని పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కిస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. దీంతో బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటు ఉంటున్నారు. అయితే తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి మాత్రం బాలీవుడ్ లోనే చాలా తక్కువ సినిమాలలో నటించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి బాలీవుడ్ లో ఎందుకు సినిమాలలో కనిపించలేదని అభిమానులకు అప్పుడప్పుడు సందేహం కూడా కలుగుతూ ఉంటుంది.

అయితే చిరంజీవి సిని పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఆయనకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయట. వాటిని తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన చిరంజీవి 1990లో ప్రతిబంద్ అనే హిందీ సినిమాలో నటించారట.రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1991లో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న గ్యాంగ్ లీడర్ సినిమాని.. ఆజ్ కా గూండారాజ్ అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ను అందుకుంది.ఆ తర్వాత తమిళంలో కూడా సక్సెస్ అయిన జెంటిల్మెన్ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఇదే చివరి సినిమా హిందీలో నటించిన చిరంజీవికి. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేయలేదు..అయితే ఈ విషయంపై చిరంజీవి మాట్లాడుతూ అప్పటి దర్శకులు మనోహన్ దేశాయ్ ,ప్రకాష్ మెహర, సజిత్ చాలామంది తనకు కథలు వినిపించారు.. అయితే అవన్నీ కూడా తనని ఆకట్టుకోలేదని కథ బాగుంటే కచ్చితంగా చేసేవాడిని అని తెలిపారు..సినిమాకి ముఖ్యం కథే నాకు ఆ కథలు నచ్చినట్లయితే చేస్తానని తెలిపారు చిరంజీవి. ప్రస్తుతం వశిష్టతో విశ్వంబర అనే సినిమాని చేస్తున్నారు.