గర్వంగా ఉంది మై లవ్.. ఇక వేచి ఉండలేను “…. సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మను మరెవ్వరూ మర్చిపోకుండా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలని ఆరబోస్తుంది.

అలాగే తన ఫ్రెండ్స్ తో ఇతర దేశాలు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేసింది. తాను వేసుకునే క్రేషబాజాజ్ కలెక్షన్స్ గురించి చెప్పింది.” మీరు రెడీ చేసే ప్రతిదీ.. ది బెస్ట్ కలెక్షన్స్ అవుతాయి.

మీ గురించి చాలా గర్వపడుతున్నాను. మై లవ్.. నేను వేచి ఉండలేకపోతున్నాను ” అంటూ రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన ప్రేక్షకులు..” ఈమె సినిమాలు చెయ్యకపోయినా.. చేతినిండా బాగానే సంపాదిస్తుంది. పలు యాడ్స్ షూట్స్ లో పాల్గొని గ్లామర్ దోస్ పెంచి హీట్ ఎక్కిస్తుంది ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.