పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం సినిమా హీరోయిన్..!!

ప్రముఖ కన్నడ నటి దండుపాళ్యం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూజా గాంధీ.. తన జీవితంలోని ఒక కొత్త అధ్యాయానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతోందట. రేపటి రోజున ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో పూజా వివాహం చేసుకోబోతోందని సమాచారం. ఇందుకోసం బెంగళూరులోని యలవంక లో పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాజిస్టిక్ కంపెనీకి కలిగిన విజయ్ తో ఈమె గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతోందని ఇప్పుడు అతనిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

నటి పూజా గాంధీ స్వస్థలం ఉత్తర ప్రదేశ్.. అయినప్పటికీ ఈమె హిందీ కన్నడ వంటి సినిమాలలోని స్థిరపడిపోయింది. ఈమెకు కన్నడ నేర్పింది కూడా విజయేనట. ఆ తర్వాత ఈమె సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది .ఇద్దరి మధ్య పరిచయం పెళ్లి వరకు తీసుకువెళ్లినట్లు శాండిల్ వుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. గతంలో 2012లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది.

కొన్ని కారణాల చేత నిశ్చితార్థం జరిగిన ఒక నెలకి వీరిద్దరూ విడిపోవడం జరిగిందట. కన్నడలో నటించిన పూజా గాంధీ మొదటి చిత్రం ముంగారు వర్మ.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో పాటు పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది.కన్నడ తమిళ్ బెంగాలీ తెలుగు హిందీ వంటి చిత్రాల్లో నటించింది.దండుపాళ్యం సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది ఇందులో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. దండుపాళ్యం మూడు సినిమాలలో కూడా ఈమె మెయిన్ రోల్ పోషించింది. మరి తనపై వస్తున్న పెళ్లి వార్తలపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి పూజా గాంధీ.