టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మొదట మలయాళం లో గీతాంజలి, బాలీవుడ్ లో రింగ్ మాస్టర్ సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ అలనాటి హీరోయిన్ మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఈ సినిమాకి ఉత్తమ నటిగా జాతి అవార్డును కూడా అందుకుంది. తర్వాత దసరా సినిమాతో పాన్ ఇండియా బ్యూటీ గా మారిన కీర్తి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇక 1992 అక్టోబర్ 10న చెన్నైలో పుట్టిన కీర్తి సురేష్.. తండ్రి ఓ నిర్మాత, తల్లి కూడా తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కీర్తి సురేష్ కూడా చైల్డ్ యాక్టర్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కీర్తి కి ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు రేవతి సురేష్. ఆమె ఓ vfx డిజైనరట. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెల్లితో కలిసి సందడి చేస్తూనే ఉంటుంది కీర్తి.
గత కొంతకాలంగా ఈమె పెళ్ళికి సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా వాటిని కీర్తి సురేష్ తండ్రి ఖండించాడు. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తన ఓన్ బ్రాండ్‌తో జ్యూవెలరీ వ్యాపారం లోకి అడుగుపెట్టబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. త్వరలోనే తన సొంత బ్రాండ్ ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సొంత బ్రాండ్స్ తో జ్యువెలరీ రంగంలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ కీర్తి సురేష్ కూడా జ్యూవెలరీ రంగంలోకి అడుగుపెడితే అదే రేంజ్‌లో సక్సెస్ అందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.