అల్లరి నరేష్ తండ్రి నన్ను గదిలోకి రమ్మన్నాడు.. సంచలన ఆరోపణలు చేస్తున్న షకీలా..!!

తమిళ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె శృంగార తారగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ విచిత్ర తన స్నేహితురాలని తామిద్దరం కొన్ని సినిమాలలో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఉందని తెలియజేసింది. అయితే విచిత్ర బిగ్ బాస్ హౌస్ లో కొన్ని విషయాలను తెలియజేసేది .. ఒక హీరో తనని అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది..ఆ హీరో పేరుని బయట పెట్టాల్సి ఉండేది అంటూ తెలిపింది షకీలా..

అంతేకాకుండా తాను కూడా గతంలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపింది. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ తండ్రి దివంగత దర్శకుడు ఇవివి.సత్యనారాయణ తనను అడ్జస్ట్మెంట్ అడిగారని తెలియజేసింది. తనతో అడ్జస్ట్మెంట్ అయితేనే నెక్స్ట్ సినిమా అవకాశాన్ని ఇస్తానని చెప్పారట.. అయినప్పటికీ తాను సార్ ఇప్పుడు సినిమాలో నటించినందుకు తనకు డబ్బులు ఇచ్చేశారు.. మరో సినిమా అవకాశం తనకు అక్కరలేదని మొహం మీద చెప్పేసిందట..

అయితే ఆయన ఇప్పుడు బతికే లేరు కానీ దీని గురించి నేను టాలీవుడ్ లో ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెబుతానని ఆయన ఆరోజు నన్ను గదిలోకి పిలిచాడు ఇదే నిజమని బాంబు పేల్చింది షకీలా.. ప్రస్తుతం షకీలా చేసిన ఈ వాక్యాలు టాలీవుడ్ లో ఒక సంచనంగ మారుతున్నాయి. బోల్డ్ నటిగా పేరు సంపాదించిన షకీలా బిగ్ బాస్ సెవెన్ సీజన్లో కూడా అడుగుపెట్టింది.అయితే రెండు వారాలకి హౌస్ లో నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. మరి ఈ విషయం పైన ఇవివి సత్యనారాయణ కుటుంబం స్పందిస్తుందేమో చూడాలి మరి.