భగవంతు కేసర్ హిట్ తో కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమా హిట్ అయితే ఆ సినిమా నిర్మాతలు డైరెక్టర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది దర్శకులు డైరెక్టర్లకు కాస్ట్లీ కార్లలను ఇవ్వడం జరిగింది.. ఇటీవల బేబీ సినిమా నిర్మాత డైరెక్టర్ సాయి రాజేష్ కు కూడా ఒక ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు.. ఇప్పుడు తాజాగా మళ్లీ డైరెక్టర్ అనిల్ రావుపూడి కూడా ఒక కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ గా అందుకోవడం జరిగింది.. డైరెక్టర్ అనిల్ రావుపూడి ,బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కీలకమైన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.కలెక్షన్స్ పరంగా కూడా భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటి లో కూడా భారీగానే దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్ పైన సాహు గరికపాటి హరీష్ రెడ్డి నిర్మించారు..ఈ నేపథ్యంలో నిర్మాతలకు కూడా కలెక్షన్స్ భారీగా రావడంతో సంతోషపడి డైరెక్టర్ అనిల్ రావిపోవుడికి ఒక ఖరీదైన కారణ సైతం గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

బ్లాక్ కలర్ టయోటా వెల్ఫర్ కారును మేకర్స్ అనిల్ రావిపూడి కి గిఫ్టుగా ఇచ్చారు. అయితే ఈ కారు ధర 1.55 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు మేకర్స్ అధికారికంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అనిల్ రావు పూడి కూడా తన తదుపరి చిత్రం కోసం సరికొత్త కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఏ హీరోతో చేయబోతున్నారని విషయం తెలియాల్సి ఉంది.