మరో అరుదైన రికార్డు సృష్టించిన నటి ప్రగతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నటువంటి నటీమణులలో ప్రగతి కూడా ఒకరు. తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. తన కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలలో అక్కగా తల్లిగా అత్తగా పిన్నిగా పలు పాత్రలు నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది.

కరోనా అప్పటినుంచి ఎక్కువగా పలు రకాల డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. 45 ప్లస్ లో కూడా ప్రగతి జిమ్ వర్కౌట్లను చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురయ్యాల చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఫిట్నెస్ కు ఎక్కువగా ప్రియారిటి ఇస్తుందో చెప్పాల్సిన పనిలేదు.. నిత్యం వర్కౌట్లతో జిమ్ లో పలు రకాల ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. అయితే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము.ఇప్పుడు తాజాగా మరొక గొప్ప విజయాన్ని సైతం అందుకున్నట్లు తెలుస్తోంది ప్రగతి.

నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఈమె కాంస్యం సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళ జాతీయస్థాయి బెంచ్ ప్రైస్ ఛాంపియన్షిప్ లో ఈమె ప్రొఫెషనల్ తో పోటీపడి అక్కడ కాంస్యం సంపాదించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారుతోంది. అయితే ఈమధ్య సినిమాలు చాలానే తగ్గించినట్లు తెలుస్తోంది ప్రగతి ఎక్కువగా జిమ్ వర్కౌట్ల పైన ఫోకస్ పెడుతున్నట్లుగా సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)