యానిమల్ మూవీ డైరెక్టర్ పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి..!!

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం చాలా ఆతృతక ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 5 భాషలలో ఈ సినిమా చాలా గ్రాండ్గా డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విలన్ గా బాబి డియోల్ కూడా నటించడం జరిగింది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది.

నిన్నటి రోజున ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు.చిత్ర బృందం. అందుకు అతిథిగా రాజమౌళి ,మహేష్ బాబు రావడం గమనార్హం. ఇందులో రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కూడా నటించారు. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ రాజమౌళి యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది కొత్త డైరెక్టర్లు వస్తూనే ఉన్నారు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీస్తూనే ఉన్నారు.. చాలామంది పేరు సంపాదిస్తున్నారని తెలిపారు.

 

కానీ సినిమా అంటే ఇలానే తీయాలి అనే డైరెక్టర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు.. అలాంటి వారిలో తన జీవితంలో చూసిన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటూ రాజమౌళి మెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.